కర్నూలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ (37) దారుణ హత్యకు గురయ్యాడు. మాసుంబాషా దర్గా సమీపంలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగదు లావాదేవీల విషయమై ఇద్దరు వ్యక్తులు ఇంతియాజ్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో వివాదం తీవ్రమై వారు రాళ్లతో దాడి చేయడంతో, తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ హత్య ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.