తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 15 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. వారాంతం కావడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
నిన్న శుక్రవారం (జూలై 31) ఒక్కరోజే 71,393 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27,846 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.46 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
అలాగే, నిన్న ఒక్కరోజే 4.33 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.58 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తిరుమలలోని వివిధ వైద్య కేంద్రాల ద్వారా 3,285 మందికి వైద్య సేవలు అందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు దర్శనం, వసతి విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
31 కంపార్ట్‌మెంట్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు..
