అన్నం అంటే చాలామందికి తెల్ల బియ్యమే గుర్తుకొస్తుంది. కానీ భారతదేశంలో అనేక రకాల బియ్యాలు పండుతున్నాయి. ఒక్కో రకం బియ్యంలో ఒక్కో ప్రత్యేక పోషక విలువ ఉంటుంది. కొన్ని ఫైబర్‌, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు, మరికొన్ని ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే పోషకాల పరంగా ఏ బియ్యం ఎంత మంచిదో తెలుసుకోవడం అవసరం.

పోషకాల ఆధారంగా బియ్యం రకాల ర్యాంకింగ్‌

1. నల్ల బియ్యం: యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, ఐరన్‌, విటమిన్‌-ఈ అధికంగా ఉండే అత్యంత పోషకమైన బియ్యం.

2. ఎర్ర బియ్యం: ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం, బీ-విటమిన్లు పుష్కలంగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది.

3. బ్రౌన్‌ రైస్‌: బ్రాన్‌ పొర ఉండటంతో ఫైబర్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌ ఎక్కువగా లభిస్తాయి.

4. వెదురు బియ్యం: అరుదుగా లభించే ఈ బియ్యంలో ప్రొటీన్‌, ఫైబర్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

5. దంపుడు బియ్యం: పూర్తిగా పాలిష్‌ చేయకపోవడంతో సాధారణ బియ్యంతో పోలిస్తే ఎక్కువ ఫైబర్‌, సూక్ష్మ పోషకాలు ఉంటాయి.

6. బ్రౌన్‌ బాస్మతీ: సాధారణ బాస్మతితో పోలిస్తే ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి.

7. తెల్ల బాస్మతీ: పాలిష్‌ చేసిన బియ్యమే అయినా ఇతర తెల్ల బియ్యాలతో పోలిస్తే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కొంత తక్కువగా ఉంటుంది.

8. తెల్ల బియ్యం: ఎక్కువగా పాలిష్‌ చేయడం వల్ల ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు తగ్గిపోతాయి. అయినా కూరలు, పప్పులు, ప్రొటీన్‌తో కలిపి పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమవుతుంది.