మేడిగడ్డ నుంచి ఒక్క చుక్క నీటిని ఎత్తిపోయకున్నా ప్రకృతి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోయింది. బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలకు ప్రకృతే స్వయంగా సమాధానం చెప్పింది" అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లికి నీళ్లు రావంటూ కేటీఆర్, హరీశ్ రావులు చేసిన ప్రచారం డొల్ల అని తేలిపోయిందన్నారు.

 

ఎగువన కురిసిన వర్షాలు, కడెం ప్రాజెక్టు ప్రవాహంతో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం 96 శాతం నిండిందని ఆయన వివరించారు. గురువారం రాత్రికి 3.5 లక్షల క్యూసెక్కుల భారీ వరద రాగా, 15 గేట్లు ఎత్తి 1.5 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీటిని పంపిస్తామన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి నీటిని బీఆర్ఎస్ నేతలు తమ ‘కూలేశ్వరం’ నీళ్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గుపడాలని ఆయన మండిపడ్డారు.