డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (యూపీఐ) వాడకం సర్వసాధారణమైపోయింది. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతీచోటా ఫోన్‌తో స్కాన్ చేసి క్షణాల్లో చెల్లించేస్తున్నాం. అయితే, ఈ సౌలభ్యం వల్ల తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేస్తున్నామని ఎప్పుడైనా అనిపించిందా? సరిగ్గా ఇదే సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొంది ఢిల్లీకి చెందిన సదాఫ్ అనే యువతి. గత రెండు నెలలుగా యూపీఐ వాడకాన్ని దాదాపుగా ఆపేసి, రోజువారీ ఖర్చులకు నగదుపై ఆధారపడటం మొదలుపెట్టింది. తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"గత రెండు నెలలుగా నేను నా రోజువారీ ఖర్చుల కోసం యూపీఐ వాడటం మానేసి, ఎక్కువగా నగదునే ఉపయోగిస్తున్నాను. దీనివల్ల నా ఖర్చు అలవాట్లలో స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా డబ్బు ఖర్చుపెట్టేటప్పుడు నాలో స్పృహ పెరిగింది" అని సదాఫ్ తన పోస్ట్‌లో పేర్కొంది.
యూపీఐతో చిన్న చిన్న చెల్లింపులు చేయడం చాలా తేలికని, దానివల్ల ఎంత ఖర్చవుతుందో కూడా తెలియదని ఆమె అభిప్రాయపడింది. "ఉదాహరణకు.. నేను మూడు కాఫీలు, ఒక స్నాక్ కొంటే, నాకు తెలియకుండానే వెయ్యి రూపాయలు ఖర్చయిపోతాయి. యూపీఐతో చెల్లిస్తే ఆ డబ్బు పోయినట్టే అనిపించదు" అని ఆమె వివరించింది.
అదే నగదు వాడకంతో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని సదాఫ్ తెలిపింది. "ప్రతిసారీ నా పర్సులోంచి 500 రూపాయల నోటు తీసి ఇస్తున్నప్పుడు, ఆ డబ్బు చేతిలోంచి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎంత ఖర్చు చేశాను, నా దగ్గర ఇంకెంత మిగిలి ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఒక్క కారణంతోనే నా అనవసరపు, ఆకస్మిక ఖర్చులు దాదాపుగా ఆగిపోయాయి" అని ఆమె చెప్పింది. అంతేకాకుండా బడ్జెట్‌ను ట్రాక్ చేయడం కూడా సులభమైందని, యాప్‌లో చెక్ చేయాల్సిన అవసరం లేకుండా పర్సులో చూస్తేనే తన ఆర్థిక పరిస్థితి అర్థమవుతుందని పేర్కొంది.
అయితే, యూపీఐని పూర్తిగా వదిలేయడం ఆచరణలో కొంచెం కష్టమని కూడా ఆమె అంగీకరించింది. "చాలామంది దుకాణదారులు చిల్లర ఉంచుకోవడం లేదు. నా బిల్లు 470 రూపాయలు అయితే, నా దగ్గర 500 రూపాయల నోటు ఉంటుంది. వాళ్ల దగ్గర, నా దగ్గర చిల్లర లేనప్పుడు తప్పనిసరిగా యూపీఐ వాడాల్సి వస్తుంది. అందుకే 100 శాతం నగదు వాడకం సాధ్యం కాకపోవచ్చు" అని ఆమె తెలిపింది.
ఈ సమస్యను అధిగమించేందుకు, తాను 80 శాతం ఖర్చులను నగదు రూపంలో, 20 శాతం అత్యవసర పరిస్థితుల కోసం యూపీఐలో ఉంచుకుంటున్నట్టు చెప్పింది. ఏదేమైనా ఈ ప్రయోగం తన డబ్బు ఖర్చు చేసే విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, ఇకపై పూర్తిస్థాయిలో యూపీఐకి మారే ఉద్దేశం లేదని సదాఫ్ స్పష్టం చేసింది.