డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, దాడిశెట్టి రాజా గారు, పేర్ని నాని గారు, కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఎంపీ వంగా గీత గారు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు, తోట నరసింహం గారు, రెడ్డి శాంతి గారు, జ్యోతుల చంటిబాబు గారు, కరణం ధర్మశ్రీ గారు, ఎమ్మెల్సీ విక్రాంత్ గారు, రౌతు సూర్యప్రకాష్ గారు, జి. శ్రీనివాస్ నాయుడు గారు, దూలం నాగేశ్వరరావు గారు, దవులూరి దొరబాబు గారు, చిన్న గారు, మల్లి వెంకట్రాజు గారు, పేర్ని కిట్టు గారు, సింహాద్రి రమేష్ గారు, అంబటి మురళి గారు, జె. గురునాథరావు గారు, శ్రీను గారు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు గారు, జక్కంపూడి విజయలక్ష్మి గారు, అడపా శేషు గారు తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నామనే అహంకారంతో రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకోవడం సరైంది కాదని, ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన “కాపు నేస్తం” వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, కాపు సమాజ హక్కులు, గౌరవం, సంక్షేమం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షతలను ఎదిరిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బలంగా నిలబడతామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కాపు సమావేశాలు నిర్వహించి ప్రజల గొంతుకగా పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
