రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100శాతం వరకు సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారం కల్పించే కీలక బిల్లుకు యూఎస్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై గత ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు.
ఈ బిల్లుకు సెనెట్‌లో 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం లభించింది. ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా ఉండి, రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని బలంగా వాదించిన రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం గౌరవార్థం ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు. ఆయన జులై 11న మరణించారు. ఆయన స్థానంలో సెనెటర్‌గా బాధ్యతలు చేపట్టిన సోదరి డార్లిన్ గ్రాహం మాట్లాడుతూ.. "ఈ బిల్లు పుతిన్‌ను తీవ్రంగా దెబ్బతీసే చోట కొడుతుంది" అని వ్యాఖ్యానించారు.
గ్రాహంతో కలిసి ఏడాదికి పైగా ఈ బిల్లు కోసం కృషి చేసిన డెమొక్రాట్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటల్ భావోద్వేగంగా ప్రసంగించారు. "ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉక్రెయిన్ నుంచి, పుతిన్ మాస్కో నుంచి మనల్ని గమనిస్తున్నారు. లిండ్సే గ్రాహం కూడా చూస్తున్నారని నేను భావిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. "ఉక్రెయిన్ ప్రజలకు మేం చెబుతున్నాం.. మీరు ఒంటరి కారు. పుతిన్‌కు మేం చెబుతున్నాం.. మీరు ఉక్రెయిన్‌ను జయించలేరు" అని బ్లూమెంటల్ స్పష్టం చేశారు.
బిల్లులోని కీలక అంశాలు
ఈ ద్వైపాక్షిక బిల్లు ప్రకారం, రష్యా నుంచి అత్యధికంగా చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని ఐదు దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్, చైనాతో పాటు అజర్‌బైజాన్, హంగేరి, స్లోవేకియా ఉన్నాయి. అయితే, రష్యా నుంచి 15 శాతం కంటే తక్కువ సహజవాయువు దిగుమతి చేసుకుంటూ, ఆ దిగుమతులను తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్న దేశాలకు మినహాయింపులు కూడా ఇందులో పొందుపరిచారు.
ఇవే కాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సీనియర్ రాజకీయ, సైనిక నాయకులు, రష్యా ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులపై కూడా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కో ఉపయోగిస్తున్న పాత ఆయిల్ ట్యాంకర్లను (రీఫ్లాగ్డ్) కూడా లక్ష్యంగా చేసుకునేలా నిబంధనలను విస్తరించారు. అయితే, దేశ జాతీయ ప్రయోజనాలకు అవసరమని భావిస్తే, ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని అధ్యక్షుడికి కల్పించారు. దీనికోసం కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
ఈ బిల్లులో రష్యా ఆంక్షలతో పాటు ఇరాన్‌పై 1996లో విధించిన ఆంక్షల చట్టం గడువును 2031 వరకు పొడిగించే అంశాన్ని కూడా చేర్చారు. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లు, ఆగస్టు 31న ప్రతినిధుల సభ సమావేశమైనప్పుడు ఆమోదం కోసం ముందుకు వెళ్లనుంది.