ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనంలో కలియదిరిగి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయం ప్రత్యేకతలు, నిర్మాణ విశేషాలను జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి.మల్లిఖార్జునరావు, బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర కళావైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహూకరించి సత్కరించారు.
అంతకుముందు సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో వస్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ వీక్షించారు. ఇటీవలే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన థింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది యువతులు ప్రదర్శించిన ఈ నృత్యాన్ని చూసి ప్రధాని ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.