సినిమా పోస్టర్లపై ప్రచురించే భారీ కలెక్షన్ల లెక్కలు నిజం కావని, ఈ విషయం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కూడా స్పష్టంగా తెలుసని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాక్సాఫీస్ ఫేక్ నంబర్ల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నాగవంశీ మాట్లాడుతూ.. "సినిమా ప్రచార పోస్టర్లపై వేసే కలెక్షన్ల నంబర్లు వాస్తవం కాదనే విషయం ఐటీ అధికారులకు బాగా తెలుసు. ప్రతి సినిమాకు సంబంధించిన అసలైన కలెక్షన్ల డేటా మొత్తం వారి దగ్గర ముందే ఉంటుంది. అందుకే మేము పోస్టర్లపై ఎంత ఎక్కువ మొత్తం చూపించినా, ఐటీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు" అని నిర్మొహమాటంగా వెల్లడించారు.
సినిమా ప్రమోషన్ల సమయంలో హీరోలు, నిర్మాతలు మాట్లాడే తీరు బట్టి సినిమా ఫలితంపై ప్రేక్షకులకు ఒక అంచనా వస్తుందని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల గురించి మాట్లాడారు. ఒక ప్రముఖ నిర్మాత బాక్సాఫీస్ లెక్కల గురించి ఇంత బహిరంగంగా మాట్లాడటంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లో కలెక్షన్ల పోస్టర్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.