సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిన్నారి వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సైనికుల బృందం సమక్షంలో ఓ బాలుడు అత్యంత వేగంగా పుష్-అప్స్ తీసి, వారికి సెల్యూట్ చేసిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పిల్లాడిలోని స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని చూసి నెటిజన్లు అతడిని 'లిటిల్ కమాండో' అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కొందరు సైనికులు నిల్చుని ఉండగా, ఓ బాలుడు ఏమాత్రం బెరుకు లేకుండా వారి ముందుకు వచ్చి వరుసగా, వేగంగా పుష్-అప్స్ చేయడం వైరల్ అయిన ఆ వీడియోలో కనిపిస్తోంది. ఏదో ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొంటున్నంత ఉత్సాహంతో ఆ చిన్నారి చకచకా పుష్-అప్స్ పూర్తి చేశాడు. అనంతరం వెంటనే నిటారుగా నిల్చుని సైనికులకు ఎంతో హుందాగా సెల్యూట్ చేశాడు.
ఆ పసివాడి గౌరవానికి ముగ్ధులైన సైనికులు కూడా అంతే హుందాగా అతనికి ప్రతి సెల్యూట్ చేశారు. ఈ అపురూప దృశ్యాలను అక్కడున్న స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. బాలుడి ఉత్సాహం, సైనికుల స్పందన చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "చిన్న వయసులోనే ఆ బాలుడిలో సైనికుడికి ఉండాల్సిన ధైర్యం, క్రమశిక్షణ ఉన్నాయి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా పుష్-అప్స్ అనంతరం జరిగిన సెల్యూట్ల ఘట్టం ఎంతో హృద్యంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.
ఆ బాలుడిలోని శక్తిసామర్థ్యాలు, సైనికుల పట్ల అతను కనబరిచిన అపారమైన గౌరవం ఈ వీడియోను ప్రత్యేకంగా నిలిపాయి.