ఏపీలో త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకాన్ని పెంపొందించేలా ఈ విమానాశ్రయాన్ని ఆధునికంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. సుస్థిరత, ఇంధన సామర్థ్యం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు, కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్‌కు సంబంధించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో వివరించారు. వీటితో పాటు పూర్తయిన పలు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఎన్‍హెచ్-365బీజీపై రేచెర్ల - గురువాయిగూడెం, గురువాయిగూడెం - దేవరపల్లి మధ్య నాలుగు వరుసల రహదారులు, ఎన్‍హెచ్-67పై నిర్మించిన తాడిపత్రి బైపాస్ ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై
ప్రధాని మోదీ చేసిన ఈ పోస్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఆయన రీపోస్ట్ చేశారు. "భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి టేకాఫ్ తీసుకుంటుంది" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ..
